Friday, November 23, 2007


జ్ఞాపకం

మనసుని కమ్మిన మబ్బులలో

కన్నీరై వర్షించిన హౄదయంలో

నదిలా సాగిన దు:ఖములో

అలలై ఎగసిన భావ సంద్రములో

నీ పలుకే వినిపిస్తోంది...

నీ నవ్వే కనిపిస్తోంది...

నీ మమతే విరబూస్తోంది...

నీ జ్ఞాపకం గుర్తొస్తోంది...

గుర్తొస్తూనే ఉంటుంది....

Thursday, November 22, 2007


పున్నమిరేయి ఏకాంత వేళలో

చల్లని పిల్లగాలులతో...

నిండుజాబిలి తొంగిచూపులతో

సిరిమువ్వల చిరుజల్లులతో

చిరునవ్వుల హరివిల్లులలో

సిరివెన్నెల విరికాంతులతో

మల్లెల సుమగంధాల పరిమళంతో

దేవకన్యలా నీవు విహరిస్తుంటే

అలా నిన్ను అలవోకగా చూస్తూ ఉండాలనిపిస్తోంది...

అలల మాటున

అమృత వాక్కుల గలగలలు వినిపించేదెవ్వరో...

కొమ్మల చాటున

నవ్వుల పువ్వులు రువ్వేదెవ్వరో...

మబ్బుల చాటున

అనురాగపు జల్లులు కురిపించేదెవ్వరో...

మది మాటున

పరిమళ గీతాలు ఆలపించేదెవ్వరో...

కలల చాటున

మువ్వల సవ్వడితో మురిపించేదెవ్వరో...

ఎవ్వరో ?


నాలో సగమై...

నాకు జగమై...


నాలో నవచైతన్య స్రవంతివి

నాలోని నీవే!!



రవి

Wednesday, November 21, 2007


నేస్తమా...
నీవుకాదా నా మధుర భావన

నేనుకానా నీ విరహపు ఆరాధన

నామది నిండా నీవే!

నాయదలోన నీవే!

"తీర"ములేని ఆశలు

చిన్ననాటి ఊసులు

తలపు తీపి గురుతులు

వలపు అల్లిన మధురానుభూతులు

కలల హరివిల్లులు!

కురవని విరిజల్లులు!

హరివిల్లులు విరియాలని...

విరిజల్లులు కురవాలని...

ఆశతో ఎదురుచూస్తూ ...

నీ నేస్తం.