Saturday, September 20, 2008
Monday, December 31, 2007

ఆమె "పరిచయం"...
తొలకరి చినుకుల స్పర్శకు
పులకరించిన పుడమి పరిమళం,
ఆమె జ్ఞాపకం!
పున్నమిరేయి గోదారి అలలపై
ఊయలలూగుతున్న జాబిళిసొగస్సు,
ఆమె మనస్సు!
మాఘమసాన హృదయపూదోటలో
మురిసీ విరిసిన ముద్దమందారం,
ఆమె స్నిగ్ధ సౌందర్యం!
శిసిరంలో గాలికి ఊగే తీగలపైన
తూగే పువ్వుల చిరుదరహాసం,
ఆమె మందహాసం!
ప్రకృతి ఒడిలో పాలమీగడలాంటి నురగలతో
వంపుసొంపుల సెలయేటి పయనం,
ఆమె చలాకీతనం!
అమ్మ ఒడిలో ఆటాడుకునే
బోసినవ్వుల బుజ్జాయి బోళాతనం,
ఆమె అమాయకత్వం...
కోటికాంతుల స్వప్నసౌధం..
లక్షపదాల ప్రణయకావ్యం..
వేలపూల మకరందం..
వందజన్మల అనుబంధం..
పదిలంగా దాచుకున్న
ఒకే ఒక విరహగీతం..
ఆమె "పరిచయం"...

మౌ'న'వీణ...
చిలిపివలపుల కన్య మధువా..
సొగసులొలికె కొంటె మగువా..
మధురస్మృతులకు మనసు కొదవా..
లేతసిగ్గుల పాలబుగ్గలు కందె మృదువా..
చరితమెరిగిన గుప్తకాలపు ముత్యరాశివా..
భాషకందని భావమొదిగిన కావ్యరేఖ...
మౌ'న'వీణ... నీవేనా?
మాటలకందని భావం
తెలుపుతోంది నీమౌనం..
అరవిరిసిన నీ ముఖారవిందం
పడుతోంది మనస్సుకు దర్పణం..
జయించగలను ఈ జగం
నీతోటిదే నా జీవనయానం..
నా ఈ చిన్న జీవితంలో
నీ ఆగమనం వర్ణరంజిత శోభితం!!
Tuesday, December 25, 2007

సాక్షాత్కారం...
అంతరంగంలోని అంతర్మధనంలో
నేను అనే అహం ఆవిరి ఐన వేళలో
ఆస్తికమో నాస్తికమో తెలియని నాకు
ఆస్తికమో నాస్తికమో తెలియని నాకు
ఈ జగమే అంధకారమై శూన్యమైన నాకు
మూర్ఖం మూర్తీభవించి జీవిస్తున్న నాకు
అజ్ఞాన తిమిరాలను పారద్రోలి
అజ్ఞాన తిమిరాలను పారద్రోలి
జ్ఞాన సౌరభాలు వెదజల్లే మోక్షప్రదాయకుడై...
ద్వైతమో అద్వైతమో తెలియని నాకు ఏకస్వరూపుడై...
కలడో లేడో తెలియని మీమాంసతో
కలడో లేడో తెలియని మీమాంసతో
అశ్రుధారలు ధారవాహికంలా ప్రవహించి
నిస్సహాయంగా..
నిరర్థకంగా..
నిర్జీవంగా..
నిరుపయోగంగా..
నిర్వేదంతో..
చావలేక బ్రతుకలేక అనుక్షణం చస్తూ బ్రతుకుతూ
అచేతనంతో ఉన్ననాకు చైతన్యస్వరూపుడై
సాకారమో నిరాకారమో తెలియని నాకు విశ్వాకారుడై
క్షర స్వరూపునికంటె అతీతుడూ అక్షర స్వరూపునికంటే శ్రేస్టుడూ అయిన పురుషోత్తముడు....
నిర్వికారుడు..
నిత్యుడు..
అనంతుడు..
సర్వేశ్వరుడు..
సర్వస్వతంత్రుడు..
పరంధాముడు..
పరబ్రహ్మస్వరూపుడు..
త్రిమూర్తుల స్వరూపుడు సృష్టి స్థితి లయకర్త...
తేజోమయరూపంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ...
దివ్యత్వాన్ని ప్రభొధిస్తూ...
విశ్వరూపుడై మోక్షమార్గాన్ని ప్రసాదించిన ఆత్మ "సాక్షాత్కారం".
Friday, November 23, 2007
Thursday, November 22, 2007
Subscribe to:
Posts (Atom)


